26 March, 2026 | 3:11 AM

మంత్రి పొంగులేటికి స్పీకర్ మందలింపు

26-03-2026 01:16 AM

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మందలించారు. గత సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించానని, కానీ మంత్రి పట్టించుకోలేదన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని పార్టీల సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల అంశంపై మాట్లాడానికి అవకాశం ఇవ్వాలని కోరడంపై స్పీకర్ స్పందించారు.

సభ్యులందిరి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ డబుల్ బెడ్ ఇళ్ల సమస్య ఉందని తెలిపారు. గతంలో తాను సూచించిన విధంగా సమీక్షా సమావేశం నిర్వహించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలందరినీ పిలిచి సమీక్షా సమావేశం నిర్వహించాలని మంత్రి పొంగులేటికి సూచించారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు తీసు కున్నప్పుడు ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేశారో.. ఇప్పుడు కూడా అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్ల అంశంలో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించాలని సూచించారు.