17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రతి వర్గానికి న్యాయం చేయాలి

21-02-2026 01:05 AM

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు, అవకాశాలు న్యాయం అందించాల్సిన అవసరం ఉందని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది .ఆడెపు వేణు  అన్నారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, డి ఎల్ ఎస్ ఆర్. పి.లక్ష్మణాచారి సమన్వయంతో శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ మహిళ, సిరిసిల్లలో రాజనీతి శాస్త్ర విభాగం సహకారంతో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను జరుపు కుంటామని,సమానత్వం,సమగ్ర అభివృద్ధి,మానవ హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. పేదలు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వెనుకబడిన వర్గాలకు న్యాయ సహాయం, విద్య, ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కేవలం చట్టపరమైన హక్కుల పరిమితిలో కాకుండా, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు కల్పించడంలో కూడా ప్రతిఫలించాలని అన్నారు. సదస్సు లో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ .ఈ.జ్యోతి, న్యాయవాదులు ఆంజనేయులు, తిరుపతి, అరుణ, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకురాలు నవ్యశ్రీ పాల్గొన్నారు.