calender_icon.png 21 February, 2026 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల బెడదకు ‘గొరిల్లా’ చెక్!

21-02-2026 01:02:28 AM

నూతనకల్, ఫిబ్రవరి 20: కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న నూతనకల్ గ్రామస్తులకు ఉపశమనం కలిగించేందుకు గ్రామ పంచాయతీ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కోతులను హింసించకుండా ఊరి బయటకు పంపేందుకు సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు సిబ్బంది కలిసి నేడు ’గొరిల్లా సూట్’ ధరించి చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది.

ఈ వినూత్న ఆలోచనను స్థానిక ఎంఆర్‌ఓ శ్రీనివాసరావు,ఎంపీడీఓ సునిత,ఎస్‌ఐ నాగరాజుతో పాటు గ్రామ రైతులు, ప్రజలు అభినందించారు. కోతులను తరిమికొట్టేందుకు ఎటువంటి హింసకు తావులేకుండా చేపట్టిన ఈ ప్రయోగంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.