15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మున్సిపల్ చైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు

21-02-2026 01:06 AM

సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్‌గా జిందం కళా చక్రపాణి 

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్గా జిందం కళా చక్రపాణి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులు, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో 20202025 కాలంలో కౌన్సిలర్గా పనిచేసి చైర్మన్గా సేవలందించానని తెలిపారు. ఇప్పుడు మరోసారి కౌన్సిలర్గా ప్రజల విశ్వాసం పొందుతూ చైర్మన్ పదవిని స్వీకరించడం గర్వంగా ఉందన్నారు.ఈ పదవి చేపట్టడానికి తనకు మద్దతుగా నిలిచిన కౌన్సిలర్ సభ్యులకు, అలాగే మొదటి నుంచి అండగా ఉన్న మూడో వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పరిపాలన అందిస్తూ, సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్వచ్ఛ సిరిసిల్ల లక్ష్యంతో పట్టణాన్ని ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న చైర్మన్ కొండూరు రవీందర్ రావు. మాజీ కౌన్సిలర్ మ్యాన రవీందర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్.మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.