4 July, 2026 | 5:49 AM

పాక్‌పై ఇంగ్లండ్ విజయం

26-05-2024 12:05 AM

బర్మింగ్‌హామ్: పొట్టి ప్రపంచకప్‌నకు ముందు పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు వర్షార్పణం కాగా.. శనివారం రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 3, ఇమాద్ వసీమ్, హరీస్ రవుఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఫఖర్ జమాన్ (45), కెప్టెన్ బాబర్ ఆజమ్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3, ఆర్చర్, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీశారు.