సెమీస్‌లో జ్యోతి సురేఖ
n ఆర్చరీ ప్రపంచకప్
షాంఘై, ఏప్రిల్ 26: తెలుగు మహిళా ఆర్చర్ జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. వ్యక్తిగత రికర్వ్ విభాగంలో సురేఖ సెమీపైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సురేఖ.. కొరియాకు చెందిన జియోన్ హున్‌యంగ్‌ను 6 (27 27 29 29 28 చిత్తు చేసి పతకం రేసులో ముందంజ వేసింది. అంతకముందు కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ సురేఖ వర్మ జోడి ఫైనల్లో అడుగుపెట్టి భారత్‌కు నాలుగో పతకం ఖరారు చేసింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెరా లాట్ మాక్సిమో ద్వయంపై సురేఖ జోడి 155 విజయం సాధించింది. ఇక శనివారం జరగనున్న మిక్స్‌డ్ కాంపౌం డ్ ఫైనల్లో ఈ జంట ఎస్తోనియా ఆర్చర్లతో తలపడనుంది. ఇప్పటికే మహిళల కాంపౌం డ్ టీమ్ విభాగంలోనూ సురేఖ తుదిపోరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బొమ్మదేవర ధీరజ్ జంట కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. సెమీఫైనల్లో ఈ జోడీ కొరియాకు చెందిన లిమ్ చేతిలో పరాజయం పాలైంది. ఆర్చరీ ప్రపంచకప్‌లో టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు నాలుగు ఫైనల్స్ ఆడనున్నారు.






