ఒలింపిక్స్‌కు నేత్ర

27-04-2024 12:38:17 AM

ఫ్రాన్స్: ఇండియన్ సెయిలర్ నేత్రకుమానన్ ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఫ్రాన్స్ వేదికగా శుక్రవారం జరిగిన ఒలింపిక్ సెయిలింగ్ క్వాలిఫయర్స్‌లో నేత్ర కుమాన న్ 67 నెట్  పాయింట్లు సాధించి లీడర్‌బోర్డ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. తొలుత ఆమె ప్రదర్శనను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగామ్ (ఈఎన్‌పీ) కింద అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జాబితాలో టాప్ స్థానంలో నిలిచిన నేత్రకుమారన్ ఒలింపిక్స్ కోటాలో స్థానం దక్కించుకుంది. ఇక నేత్రకుమానన్ సెయిలింగ్‌లో భారత్ తరపున ఒలింపిక్స్‌లో కోటా పొందిన రెండో అథ్లెట్‌గా నిలిచింది. ఇంతకముందు భారత్ నుంచి మరో సెయిలర్ విష్ణు శరవణన్  పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐఎల్‌సీఏ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 125 నెట్  పాయింట్లు సాధించి ఒలింపిక్స్ కోటా పొందాడు. కాగా 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత తరపున సెయిలింగ్ క్రీడలో పాలొన్న నేత్ర కుమానన్ 35వ స్థానంలో నిలిచింది.

 ఈఎన్‌పీ అంటే

సెయిలింగ్ ఎక్కువగా పరిచయం లేని దేశాల్లో  ఆ క్రీడ మరింత అభివృద్ధి చెందాలనే  వరల్డ్ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్ (ఈఎన్‌పీ)ని ఏర్పాటు చేసింది. సెయిలింగ్ క్రీడలో ప్రావీణ్యం పొందిన అథ్లెట్లను ప్రోత్సాహపరచాలన్నదే ఈఎన్‌పీ లక్ష్యం.