పాక్‌పై కివీస్ గెలుపు
లాహోర్: పాకిస్థాన్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టిమ్ రాబిన్‌సన్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా..డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (26 బంతుల్లో 34) రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 179 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులకు పరిమితమైంది. ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇఫ్తికర్ అహ్మద్ (23), ఇమాద్ వసీమ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో విలియమ్ రూర్కీ 3, బెన్ సీర్స్ రెండు వికెట్లు తీశారు.






