15 July, 2026 | 5:24 AM

వైద్యాధికారులపై మంత్రి ఆగ్రహం

04-07-2024 02:09 PM

హైదరాబాద్: సంగారెడ్డి జడ్పీ సమావేశంలో తెలంగాణ ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్ లో సరైన మందులు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రోగులకు మందులు ఎందుకు అందుబాటులో ఉంచలేదని అధికారులను నిలదీశారు. నెలకు ఎన్ని మందులు సరఫరా అవుతున్నాయో డీపీఆర్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి ఉన్న సమయంలో మందులు ఎందుకు లేవని మంత్రి రాజనరసింహ ప్రశ్నించారు.