30 June, 2026 | 9:07 PM

Breaking News

రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •  

కబీర్ వీడియో కలకలం

11-04-2026 12:00 AM
  1. ఎన్నికల వేళ ఏజేయూపీ అధినేత వీడియో వైరల్
  2. బీజేపీతో వెయ్యి కోట్ల డీల్ కుదిరిందని టీఎంసీ ఆరోపణలు
  3. ఏజేయూపీతో పొత్తు రద్దు: ఎంఐఎం

కోల్‌కతా, ఏప్రిల్ ౧౦: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) శుక్రవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధినేత హుమాయున్ కబీర్ మైనార్టీల ఓట్లను మళ్లించేందుకు బీజేపీతో చేతులు కలిపి కుట్ర చేశారని, అందుకు కబీర్ భారీ మొ త్తంలో డబ్బు తీసుకున్నారని, కుట్రలో ప్రధా ని కార్యాలయం (పీఎంవో) భాగమైందనేది వీడియో సారాంశం.

ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో కబీర్ సమన్వయం చేసుకోవాలని కూడా వీడియో ఫుటేజీలో ఆడియో వినిపించింది. అంతేకాదు.. ‘ముస్లింలను మోసం చేయడం సులభం.. అందుకు బాబ్రీ మసీదు కూల్చివేతే పెద్ద ఉదాహరణ’ అని కబీర్ వ్యాఖ్యానించినట్లు ఉంది. ఈ వీడియోపై టీఎంసీ నేతలు తీవ్రమైన ఆరోప ణలు చేశారు. తమ పార్టీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ కుట్ర వెలుగు చూసిందని వెల్లడించారు.

ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి కబీర్ రూ.200 కోట్లు ముందస్తుగా పొందినట్లు ఆరోపించారు. బీజేపీతో కబీర్ కుదుర్చుకున్న ఒప్పందం దాదాపు రూ.1000 కోట్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశా రు. వారి వ్యాఖ్యలను కబీర్ ఖండించారు. ఏఐని వినియోగించి టీఎంసీ నేతలు తనపై కుట్రలు పన్నారని వ్యాఖ్యానించారు.

2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తా ను టచ్‌లో లేనని తెలిపారు. కబీర్ వీడియో వైరల్ అయిన నేపథ్యం లో ఏజేయూపీతో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం స్పందించింది. పొత్తును నిర్దంద్వంగా రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.