అధిక ధరలు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కళాజాత
జవహర్‌నగర్‌లో ప్రజానాట్యమండలి జిల్లా కౌన్సిల్ సమావేశం
జిల్లా ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షులు వై.నాగేశ్వరరావు
జవహర్ నగర్, జూన్ 7 (విజయక్రాంతి): అధిక ధరలు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కళాజాత కార్యక్రమాలు రూపొందిస్తామని మేడ్చల్ జిల్లా ప్రజానాట్యమండలి గౌరాధ్యక్షులు వై నాగేశ్వరరావు పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో తెలంగాణ ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సమావేశం కె. ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా తెలంగాణ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షులు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై నేడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, అధిక ధరలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కళాజాత కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బి. వెంకటాచారి, అధ్యక్షురాలు ప్రమీల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి బాబు, ఉపాధ్యక్షులు రాములు, నరసమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.






