15 July, 2026 | 5:31 AM

కల్కిలో అలనాటి నటి

20-06-2024 12:05 AM

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటికే దేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు అలనాటి నటి శోభన కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నారంటూ ఆమె లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఆమె పూర్వీకులు కూడా ఆమెలాగే వేచి ఉన్నారు’ అనే క్యాప్షన్‌ను ఈ పోస్టర్‌కు జోడించారు. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ముందు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముందే చెప్పారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఒక్కో సర్‌ప్రైజ్‌ను ప్రకటిస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. తాజాగా శోభన నటించిన విష యాన్ని తెలియజేయడం ఇందులో భాగమే. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించిన శోభన తెలుగులో చివరిసారి 2006 లో వచ్చిన ‘గేమ్’ చిత్రంలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’లో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అంటే 18 ఏండ్ల తర్వాత శోభన టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారన్నమాట. 

తాజాగా దర్శకుడు నాగ్ ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించారు. “ఈ కథ బేసిక్‌గా అన్నిటికీ క్లుమైక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరగొచ్చు. ఇలాంటి వాటన్నింటికీ ఇది క్లుమైక్స్. కేవలం ఇండియాలోనే వరల్డ్‌లో అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు” అని వివరించారు నాగ్ అశ్విన్.