సిక్కోలులో తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా చందు మొండే టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తండేల్’. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం తదుపరి చిత్రీకరణ కోసం సిక్కోలుకు పయనమైంది. మత్స్యకారుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాకి సంబంధించి అక్కడి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు దర్శకుడు.
అయితే సినిమా టీమ్ శ్రీకాకుళం వస్తున్నారన్న వార్త తెలుసుకున్న అక్కినేని అభిమానులు చిత్ర బృందానికి ఘన స్వాగతం పలకడంతోపాటు నాగచైతన్యను గజమాలతో సత్కరించారు. కాసేపు అభిమానులతో ముచ్చటించిన నాగచైతన్య సినిమాలోని ‘ఈపాలి యేట.. ఇంక రాజులమ్మ జాతరే. తుల్లగొట్టేయాల..’ అన్న డైలాగ్‌తో వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందు మొండేటి స్థానిక అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.






