calender_icon.png 22 November, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో గౌడ చలో సూర్యాపేట

22-11-2025 08:07:23 PM

ఇంటికో గౌడు... ఊరికో వాహనంతో కదం తొక్కాలి..

కెజికెఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాజుల ఈశ్వరయ్య గౌడ్..

మంగపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో కల్లుగీత కార్మికుల సమస్యపై ఈనెల 28న సూర్యాపేటలో జరిగే కల్లుగీత రణభేరి బహిరంగ సభకు తరలిరావాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంలో చలో సూర్యాపేట బహిరంగ సభ పోస్టర్ కరపత్రాలను ములుగు జిల్లా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల ఈశ్వర్ గౌడ్ రంగు సత్యనారాయణ గౌడ్ ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్టంలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై న్యాయమైన హక్కుల కొరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలపై గీత కార్మికులందరూ ఐక్యతతో ముందుకుసాగుతూ ఈనెల 28న జరిగే చలో సూర్యాపేట బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.

అలాగే ఇంటికో గౌడు... ఊరికో వాహనంతో పెద్దఎత్తున బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నక్క యాకయ్య గౌడ్ రావుల శ్రీనివాస్ గౌడ్, లోడే శ్రీనివాస్ గౌడ్ మండల కమిటీ సభ్యులు చామకూరి కృష్ణ గౌడ్ లోడే కృష్ణ గౌడ్ బొంబోతుల సత్యం గౌడ్ గంట చిట్టిబాబు గౌడ్ రామగాని నరేందర్ గౌడ్ లగ్గ త్రివిక్రమ్ గౌడ్ లగ్గ రాజు అనపర్తి శ్రీను గడ్డం పరమేష్ నక్క శ్రీనివాస్ గౌని రమేష్ బండి కోమరయ్య  గుండు నర్సయ్య లోడే నరేష్ లోడే రమేష్ భూర సుదాకర్ బండపెల్లి నర్సయ్య రమేష్ పాల్గొన్నారు.