22-11-2025 08:08:33 PM
సిద్దిపేట: ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీ హెచ్సీఎల్ నిర్వహించిన ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్– టెక్ బీలో పాల్గొని సిద్దిపేట మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్టిట్యూడ్, రాత పరీక్షల్లో విజయవంతంగా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ పరకాల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈ విజయంలో విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకుల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. విద్యార్థులను మార్గనిర్దేశం చేసిన అధ్యాపకుల కృషిని మరియు కాలేజీ కెరీర్ కౌన్సిలర్ వి. పూర్ణచందర్, నరేందర్ రెడ్డి, భాను ప్రకాష్ లను ప్రిన్సిపల్ పరకాల శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఎంపికైన విద్యార్థులు కే గౌతమ్, దిలీప్ రెడ్డి, మధు, బహదూర్ సింగ్, కార్తీక్ మరియు సాగర్ లు మాట్లాడుతూ ఈ విజయం మా సంస్థకు గౌరవాన్ని తీసుకువచ్చి, ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది అని తెలిపారు.