calender_icon.png 22 November, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

22-11-2025 08:04:38 PM

మంగపేట (విజయక్రాంతి): మండలంలో నిరుపేద ప్రజలు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పార్టీ నుండి అండదండలు పొందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. తెలంగాణ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు శనివారం ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన జనగాం బుచ్చయ్య ఇటీవల మృతిచెందడంతో దశ దినకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి కాంగ్రెస్ పార్టీ తరపున 50 కేజీల బియ్యం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య టౌన్ అధ్యక్షుడు ఎండీ సులేమాన్ మండల నాయకులు ఉమ్మనేని రమేష్ గంపల శివకుమార్ టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు కందుకూరి రతన్ పడిదల హన్మంత్ కొండగొర్ల రాంబాబు సునారికాని శ్రీను జనగాం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.