7 April, 2026 | 11:03 PM

కేఎల్ఐ కాల్వకు మళ్ళీ గండి..!

01-12-2024 12:09 PM

ఇప్పటికే ఆరు సార్లు గండి

రైతుల పొలాలను మళ్ళీ ముంచెత్తిన కృష్ణ నీరు

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

వెళ్దండ మండలం డి-82 వద్ద ఘటన 

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువకు గండి పడింది. వెల్దండ మండలం బర్కత్ పల్లి గ్రామ సమీపంలోని డి-82 వద్ద గండి పడి సాగు నీరు వృథాగా రైతుల పంట పొలాల గుండా పారుతోంది. అదే ప్రాంతంలో సుమారు ఆరుసార్లు గండి పడినప్పటికీ సంబంధిత అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని  రైతులు మండిపడుతున్నారు.మరమ్మతల పేరిట డబ్బులు దండుకొని నాశరకంగా నిర్మాణం చేపడుతుండడంతోనే గండి పడిన చోటే మళ్లీ గండ్లు పడుతున్నాయని రైతులు మండిపడుతున్నారు.

పంట పొలాలు కోతకు గురికావడంతోపాటు బోరు బావులు, విద్యుత్ స్తంభాలు, ఇతరత్రా వ్యవసాయ పనిముట్లు సైతం వరదకు కొట్టుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండికి ముందు ప్రాంతంలోని కేఎల్ఐ ఆధారిత పంట పొలాలు సైతం ఎండుముఖం పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అన్ని విధాల రైతులు తీవ్రంగా నష్టపోతున్న సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.