31 July, 2026 | 8:19 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

20 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం

01-12-2024 12:01 PM

చెన్నై: తమిళనాడు, చెన్నై తుఫాను ఫెంగల్ తుపాన్ బీభత్సం సృష్టించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తమిళనాడులోని పుదుచ్చేరి, విల్లుపురం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇది అనేక ప్రాంతాలలో వరదలకు దారితీసింది. తుఫాను తీవ్రతను భరించిన చెన్నై, దాని ల్యాండ్‌ఫాల్‌కు ముందు గంటకు 90 కిమీ వేగంతో గాలులు వీస్తూ, ఆదివారం సాధారణ స్థితికి చేరుకోవడంలో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నగరంలోని విమానాశ్రయం 12 గంటలకు పైగా మూసివేయబడిన తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. పాండిచ్చేరి బీచ్ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో బీచ్ ను అధికారులు మూసివేశారు.  తుపాన్ బీభత్సానికి పాండిచ్చేరిలో వందలాది ఇళ్లు నీటమునిగిపోయాయి. 

శనివారం ఉదయం 8.30 నుండి ఆదివారం ఉదయం 5.30 గంటల మధ్య పుదుచ్చేరిలో అత్యధికంగా 46 సెం.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 2004లో నగరంలో 21 సెం.మీ వర్షపాతం నమోదైనప్పటి నుండి 20 సంవత్సరాలలో అత్యధికమని అధికారులు తెలిపారు. విల్లుపురం జిల్లాలోని మైలమ్‌లో అత్యధికంగా 50 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీగా వీచిన గాలుల తీవ్రత కారణంగా వందలాది చెట్లు నేలకూలాయి. చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై తిండివనం నుంచి ఉలుందూర్‌పేట వరకు భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుపాను మిగిల్చిన విధ్వంసం ఎంత ఉందో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడే వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పుదుచ్చేరిలో వృద్ధులను పడవలతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుదుచ్చేరి, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.