అయోధ్యలో 200 మంది భక్తులతో సీతారాముల కల్యాణం
ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛత్రపతి శివాజీ పీఠం అధ్యక్షులు బైలూర్ యోగీష్ ప్రభు తెలిపారు. ఈ నెల 23న ఉదయం 7.30 గంటలకు కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, తాడ్బండ్ అంజనేయస్వామి ఆలయ దర్శనం అనంతరం అయోధ్యకు బయలుదేరనున్నట్లు చెప్పారు.
ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు అయోధ్య శ్రీరామ మందిరంలో 200 మంది భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చత్రపతి శివాజీ పీఠం ప్రతినిధి గోపాల్ చారి, బడేసాబ్, ఛత్రపతి శివాజీ పీఠం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కేసరి మహేందర్, ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.






