calender_icon.png 9 June, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా కమల రాజశేఖర్ ప్రమాణ స్వీకారం

09-06-2025 11:46:13 AM

పెద్ద ఎత్తున పాల్గొన్న లైన్స్ క్లబ్ నేతలు సభ్యులు 

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ కమ్మ సత్రం హాల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం(Lions Club of Bhadrachalam) 32వ అధ్యక్షురాలుగా పిన్నింటి కమల రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు కార్యదర్శిగా ముహూర్తాల సిద్ధారెడ్డి కోశాధికారిగా ఎడ్లపల్లి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా 2025- 26 సంవత్సరానికి ఎన్నికైన నూతన బాడీ కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. భద్రాచలం లైన్స్ క్లబ్ ప్రారంభమై 31 సంవత్సరాలు అయినప్పటికీ ఒక మహిళా సభ్యురాలు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  భద్రాచలం  ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రాంత ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని, ముఖ్యంగా వరదలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీరి అందించే సేవ మరువ లేనిదని అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఏ కార్యక్రమం చేపట్టిన తను పూర్తి సాయి సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కమలా రాజశేఖర్  చిన్న పిల్లల వైద్యులుగా భద్రాచలం  ప్రాంతాలలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని,  చేస్తున్న సేవలకు గుర్తించి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా కమల రాజశేఖర్ నీ ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ గవర్నర్, మాజీ గవర్నర్లు జోనల్ స్థాయి చైర్మన్ కురిచేటి శ్రీనివాస్ తోపాటు భద్రాచలం లైన్ సభ్యులు ఎస్ ఎల్ కాంతారావు, ఏ జగదీష్, చావ లక్ష్మీనారాయణ తిప్పన సిద్దులు, డాక్టర్ రాజశేఖర్ పరిమి సోమశేఖర్ బి వెంకటరెడ్డి, బిలిపెళ్లి రంగారెడ్డి, సభ్యులు సంఘ సేవకులు భద్రాచలం పట్టణ ప్రముఖులు  మహిళలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సంధానకర్తలుగా యోగి సూర్యనారాయణ, గట్టు వెంకటాచారి, వీధుల రాంబాబు వ్యవహరించారు.