కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో గరం గరం
ఎజెండా అంశాలు ఎలా చేర్చారు
తమతో చర్చించకుండానే ఎజెండా అంశాలు చేర్చడమేంటి?
గత సమావేశంలో చర్చించిన అంశంలో ఒకటైన పూర్తి చేశారా
కౌన్సిలర్ల ప్రశ్నలకు జవాబు ఇవ్వని చైర్‌పర్సన్
సభ నుంచి చైర్ పర్సన్ వెళ్లడంతో గంటలోనే వాయిదా పడి ముగిసిన సభ
కామారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): మున్సిపల్ సమావేశంలో ఎజెండా అంశాలు కౌన్సిలర్ తో చర్చించకుండా ఎలా ఎజెండాలో చేర్చారంటూ పలువురు కౌన్సిలర్లు చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణిని ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో పలువురు బిజెపి, టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఏజెంట్ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత సమావేశంలో ఎజెండాలో చర్చించిన అంశాల్లో ఏ ఒక్కటైనా సమస్య పరిష్కారం చేశారా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత సమావేశం ఎజెండా ఎవరికి చెప్పి చేశారంటూ ఎవరితో చర్చించారంటూ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా కొత్త ఎజెండా అంశాలను చేర్చడం ఏమిటి అని ప్రశ్నించారు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ సమావేశంలో ఏ ఒక్క ఎజెండా అంశాన్ని చర్చించకుండానే కౌన్సిలర్ చైర్ పర్సన్ పై గరం గరం వ్యక్తం చేయడంతో సమస్యలపై చర్చించకుండానే గంటలోనే సమావేశం నుంచి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి వెళ్లిపోవడంతో సభను వాయిదా వేస్తూ ముగించారు.
వార్డుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ కౌన్సిలర్ లు పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశం అవుతే కనీసం తమ వార్డు లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నం చేద్దామంటే మున్సిపల్ చైర్ పర్సన్ తన ఇష్టానుసారంగా ఎజెండాను రూపొందించి కౌన్సిలర్లతో చర్చించకుండానే కౌన్సిల్లో ప్రవేశపెట్టడం తీరుపై కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి అంటూ ఇస్తాను సారంగా వ్యవహరిస్తే ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయని బిజెపి కౌన్సిలర్ లు ప్రశ్నించారు.
చైర్ పర్సన్ కౌన్సిలర్ లు సమస్యలపై చర్చించేందుకు రసభస చేయడం వల్ల సమావేశం నుంచి వెళ్లాల్సి వచ్చిందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాన్ని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశాలను చర్చించాల్సి ఉండగా తప్పుదోవ పట్టించడం కౌన్సిలర్లకు తగదు అన్నారు. ఒక్కొక్క ఏజెంట్ అంశాన్ని చర్చించిన తర్వాత పరిష్కారం పై చొరవ చూపడం జరుగుతుందని, అలాంటి సమస్యలపై చర్చించకుండానే గందరగోళం సృష్టించడం కామారెడ్డి అభివృద్ధికి కౌన్సిలర్లు సహకరిస్తున్నారా లేక అడ్డుకుంటున్నారా అనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.
కౌన్సిల్ సమావేశంలో సమస్యలు చర్చించేందుకే సమావేశం నిర్వహిస్తే సమావేశం సాఫీగా జరగకుండా కొంతమంది కౌన్సిలర్లు రసభస చేయడం తగదన్నారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రతి ఒక్క కౌన్సిలర్ సహకరించాలని కోరారు. ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, సమస్యలపై చర్చించకుండానే గందరగోళం సృష్టిస్తే ఎక్కడ చర్చించడం జరుగుతుందని కౌన్సిలర్లు గ్రహించాలని చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి కోరారు.
ప్రతి వార్డులో ప్రధాన సమస్యలను అధికారుల ద్వారా తెలుసుకొని ఎజెండా అంశంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. కొంతమంది కౌన్సిలర్లు దురుద్దేశ పూర్వకంగా సమావేశాన్ని అడ్డుకోవడం, అల్లరి చేయడం వల్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తప్ప పరిష్కరించేందుకు సహకరించడం లేదన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రతి కౌన్సిలర్ సహకరించాలని ఆమె కోరారు. గంటలోపే సమావేశాన్ని మమ అనిపించి ముగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






