మోదీని కలిసిన కపూర్ ఫ్యామిలీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. అలనాటి బాలీవుడ్ స్టార్ రాజ్‌కపూర్ వారసత్వాన్ని రెండు తరాల నటులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 14న ఆయన శతజయంతి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం కపూర్ ఫ్యామిలీమెంబర్స్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌కపూర్ పేరిట నిర్వహించనున్న ‘ఆర్కే ఫెస్టివల్’కు ప్రధానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ తమ కుమారుల కోసం మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మీట్‌లో ఆమె భర్త సైఫ్ ఆలీఖాన్‌తో పాటు నీతూసింగ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, కరిష్మాకపూర్, రిద్దిమా కపూర్ సాహ్ని, ఆదార్ జైన్, ఆర్మాన్ జైన్ సందడి చేశారు. ప్రధాని మోదీతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






