18 June, 2026 | 1:32 AM

కానరాని చినుకు జాడ!

18-06-2026 12:05 AM

* వర్షాలు కురియాలంటూ కప్పతల్లి ఆటలు

* ఆకాశం వైపు చూస్తున్న రైతులు

కరీంనగర్, జూన్17(విజయక్రాంతి): ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు మొదలు కాలేదు. ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ, భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాబోయే 3 నుండి 4 రోజుల్లో జూన్ 21 నుండి అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని జూన్ 22, 23 తేదీల నుంచి మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెపుతున్న చినుకు కోసం ప్రజలు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. పండితులు వరుణ యాగం నిర్వహిస్తున్నారు.

ఖరీఫ్ సాగు కోసం రైతన్న ఆకాశం వైపు చూ స్తుండగా తాగునీటి కష్టాలు ఎప్పుడు టోలుగతాయో అని మహిళలు చూస్తున్నారు.ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత దాదాపు $37 నుం డి 40 డిగ్రీలవరకు నమోదవుతోంది.కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు ఆలస్యం కావ డం వానలు పడక పంటల సాగు మొదలు కాకపోవడంతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామాల్లో  సాంప్రదాయ జానపద ఆచారం ప్రకారం కప్పతల్లి ఆటలు ప్రారంభించారు. ఈ ఆచారంలో చిన్నారులు, మహిళలు కప్పకు పూజలు చేస్తూ వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.

ఒక సంచిలో కప్పను పెట్టి, దానిని ఒక పొడవాటి కర్రకు  రోకలికి కట్టి ఊరేగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని, చెరువులు నిం డి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రా మస్తులు గట్టిగా నమ్ముతారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, హుజరాబాద్, తదితర మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండ లం కంది కట్కూరు గ్రామస్తులు కప్పతల్లి ఆట  ఆడి వరుణ్ణి పూజించారు. కరీంనగర్ నగరంలో వేద పండితులు నమిలికొండ రమణా చార్యులు అద్వర్యం లో యాగం నిర్వహించారు.