10 March, 2026 | 7:30 AM

యువ సంకల్ప ఫౌండేషన్ చే పరీక్ష ప్యాడ్లు అందజేత

09-03-2026 05:54 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కస్తూరిబా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ... సరస్వతి మాత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని మనం చదువుకుంటే ఎక్కడికి వెళ్లినా బతుకగలమని అందుకని మనం మంచిగా చదివి మనల్ని కన్నా తల్లిదండ్రులకు మనకు చదువు చెప్పిన గురువులకు పేరు తీసుకురావాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఫౌండేషన్ అన్ని విధాల సహయ సహకారాలు ఉంటాయని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రభుత్వ స్కూల్లో చదివి మంచి ఉన్నతమైన చదువును చదవాలని మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్,దేవసాని సన్నీ,కరస్పాండెంట్ ఎం.సప్న ఉపాధ్యాయులుపాల్గొన్నారు.