"టిమ్ము" పేరిట ఆర్టీసీ "డ్రైవర్ల" పై వేధింపులు
డ్రైవర్ డ్యూటీ తో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలంటూ ఒత్తిడి
లేదంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామంటూ బెదిరింపులు
గత కొన్ని రోజుల క్రితం బోధన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఆత్మహత్యానికి ప్రయత్నం
బలవంతపు డ్యూటీలు, ఒత్తిడిలకు గురవుతున్నామని డ్రైవర్ల ఆందోళన
ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా బలవంతపు ఒత్తిడి మానుకోవాలంటూ డిమాండ్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో టిమ్ము పేరిట ఆర్టీసీ డ్రైవర్లపై వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలని ఆర్టిసి డిపోలోని అధికారులు బలవంతపు డ్యూటీలు వేస్తూ డ్రైవర్లను మానసిక శోభకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ సీనియర్ ప్రకారం పెట్టిన లిస్టులో ఉన్న డ్రైవర్లు తప్పనిసరిగా కండక్టర్ డ్యూటీని కూడా చేయాలంటూ నిబంధనలు పెట్టడం పట్ల డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ డ్యూటీ తోని ఒత్తిడికి గురవుతున్నప్పటికీ మళ్లీ కండక్టర్ డ్యూటీ చేయాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని ఇలాంటి చర్యలు ఆర్టీసీ డిపో అధికారులు మానుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఎవరైనా డ్రైవర్లు కండక్టర్ డ్యూటీ చేయనని తెలిపితే వెంటనే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామంటూ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇలా అధికారులు ఇష్టం వచ్చినట్లు డ్రైవర్లపై పని ఒత్తిడి బలవంతపు డ్యూటీలు వేస్తూ ఆందోళన గురి చేస్తున్నారని పని భారంతో సతమతమవుతున్నామని డ్రైవర్లు పేర్కొంటున్నారు.
నిజాంబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో బలవంతపు డ్యూటీ విధులు నిర్వహించాలని ఆర్టీసీ అధికారులు తెలపడంతో గత 15 రోజుల క్రితం ఓ డ్రైవర్ బస్సు డిపో లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసేందుకు ప్రయత్నించగా తోటి సిబ్బంది వెంటనే ఆ డ్రైవర్ను కాపాడిన సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనలు బాన్సువాడ ఆర్టీసీ డిపోలో పునరావతం కాకుండా అధికారులు అధిక ఒత్తిడి అదనపు డ్యూటీలు వేస్తూ డ్రైవర్లను ఇబ్బందికి గురి చేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు.
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సీనియర్ డ్రైవర్లు అందరు కూడా టిమ్ము నేర్చుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. బలవంతంగా డ్రైవర్లను రెండు డ్యూటీలు చేయమని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని డ్రైవర్ ప్రశ్నిస్తున్నారు.వారానికి ఆరు రోజులు డ్యూటీ చేపిస్తున్నారనీ ఆ డ్యూటీలోనే అదనంగా డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఇలాంటి చర్యలు మానుకోవాలని డ్రైవర్లు సూచిస్తున్నారు.
ఒకవేళ డ్రైవర్లు రెండు పనులు చెయ్యను అని మొండికేస్తే ఇతర జిల్లాలకు ఖమ్మం, మహబూబ్ నగర్ లకు బదిలీ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. తమబాధలు ఎవరితో చెప్పుకోవాలనీ డ్రైవర్లు పేర్కొనడం గమనార్హం. ఇలాగే ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తే డ్రైవర్ల అందరూ కోర్టు మెట్లు ఎక్కడం ఒకటే మార్గమని అంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఇలాంటి బలవంతపు ఒత్తిడి లను మానుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
డ్రైవర్లు తప్పనిసరిగా టిమ్ము విధులు నిర్వహించాలి
బాన్సువాడ ఆర్టిసి డిఎం రవికుమార్
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సీనియర్టి డ్రైవర్లు తప్పనిసరిగా టిమ్ము విధులు నిర్వహించాల్సిందేనని ఆర్టీసీ డిఎం రవికుమార్ విజయ క్రాంతితో తెలిపారు. డ్రైవర్లు తప్పనిసరిగా వన్ మేన్ సర్వీస్ విధులను నిర్వహించే విధంగా అర్హులైన డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డిఎం తెలిపారు. విధులు నిర్వహించ ని ఎడల డ్రైవర్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారని విజయ క్రాంతి వివరణ అడగగా అలాంటిది ఏమీ లేదని డిఎం సమాధానం చెప్పారు. తప్పనిసరిగా డ్రైవర్లు తీసుకోవాలని డిఎం రవికుమార్ సూచించారు.




