27 June, 2026 | 7:03 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సర్వసాధారణం : సీఐ శివశంకర్

27-06-2026 05:51 PM

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లకు శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఐ శివశంకర్, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను అభినందించారు. బదిలీపై వెళ్ళిన కానిస్టేబుల్ లో మల్లేష్ మద్దూరు, రాము, కృష్ణ సృజన దామరగిద్ద పోలీస్ స్టేషన్ లకుబదిలీపై మల్లేష్ మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు, వెళ్ళారు.

ఈసందర్భంగా సీఐ శివశంకర్ ,వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగం అనేది విధి నిర్వహణలో భాగంగా ఉంటుందని ఎక్కడకు వెళ్ళినా విధినిర్వహణలో నిజాయితీగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రాము, మల్లేష్ లు పేట పోలీస్ స్టేషన్ కు మంచి పేరు తెచ్చారని వారి సేవలను కొనియాడారు. దీంట్లో భాగంగానే వారిని పూలమాలలతో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎస్సై 2 గాయత్రి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.