22 April, 2026 | 2:25 AM

కవితకు మళ్లీ నిరాశే

21-08-2024 03:50 AM

బెయిల్ పిటిషన్‌ను వాయిదా వేసిన సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైల్లో ఉన్న కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆమె పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారిం చింది. ఈ సందర్భంగా సీబీఐ కౌం టర్ దాఖలు చేయగా, ఈడీ కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరింది. దీంతో మూడు రోజు ల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న ఒకే ఒక్క మహిళ కవిత అని, నేరం చేశారని ఏ ఆధారం లేకపోయినా ఐదు నెలలుగా జైల్లో ఉంచారని ఆరోపిం చారు. వెంటనే ఆమెకు బెయిల్ మం జూరు చేయాలని కోరారు. ఈ వాదనను సీబీఐ, ఈడీ న్యాయవాదులు వ్యతిరేకించారు. దీంతో తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం, మూడు రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయా లని కవిత న్యాయవాదులను కూడా ఆదేశించింది.