ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
12-08-2026 06:38 PM
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్,(విజయక్రాంతి): ప్లాస్టిక్ ను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధం ర్యాలీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పేపర్ బ్యాగులు, వాడొద్దని, భూమిలో పడవేసినప్పుడు కరిగి మట్టి అయ్యేటటువంటి వస్తువులను వాడాలని దానివల్ల పర్యావరణంలో కాలుష్యం ఏర్పడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సురేందర్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్యామల, వర్ష, అంబికా, పోశెట్టి, మానాల శంకర్, గణపత రెడ్డి, దిరాజ్, చేతన్, తదితరులు ఉన్నారు.






