28 July, 2026 | 3:53 PM

నేరెళ్ల బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి.. దోషులకు శిక్ష పడాలి: కవిత

28-07-2026 03:21 PM

నెరేళ్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నెరేళ్లలో దాష్టీకానికి గురైన బాధిత కుటుంబాలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత(Telangana Rakshana Sena Chief Kavitha) పరామర్శించారు. నెరేళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన అని పేర్కొంటూ, అప్పటి ప్రభుత్వంలో భాగమైన కుటుంబ సభ్యురాలిగా బాధితులకు క్షమాపణ కోరారు. బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఎస్సీ కమిషన్ నివేదిక విడుదల చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, గంధం గోపాల్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ మహమ్మద్ మజీద్, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు సుమలత శర్మ, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా నాయకురాలు మరియు తంగళ్ళపల్లి ఇంచార్జ్ చెరుకుపల్లి శైలజ కార్యక్రమంలో పాల్గొన్నారు.