ప్రజలకు మరింత సౌకర్యవంతం కోసం మీసేవ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే
28-07-2026 03:24 PM
బోథ్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండాలని మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మండలంలోని ధన్నూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దూర భారం తగ్గి తక్షణమే పనులు పూర్తయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో దన్నూర్ గ్రామ సర్పంచ్ ఎల్మ రోహిణి మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి మండలంలోని పలు గ్రామాల పార్టీ నాయకులు మీ సేవ కేంద్రం నిర్వాహకురాలు ఐట్ల సంయుక్త పాల్గొన్నారు.






