28 July, 2026 | 4:09 PM

ఓం కాలభైరవ... ఓం ఓం భైరవ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

28-07-2026 03:36 PM

రామారెడ్డి,(విజయక్రాంతి): రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో  మంగళవారం స్వామివారికి భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకం, సింధూర పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులు "ఓం కాలభైరవాయ నమః... ఓం ఓం భైరవ..." అంటూ చేసిన భజనలతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.