19 June, 2026 | 11:27 AM

నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

19-06-2026 09:55 AM

పెద్దవూర : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపూర- నాగార్జునసాగర్ మధ్య  ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ కు చెందిన థాంసయ్య(60), ప్రకాశ్ రావు(40), మరో కారులో ఉన్న సాయికుమార్ (26)గా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.