5 June, 2026 | 2:44 PM

అమీర్‌పేట అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన కవిత

05-06-2026 01:38 PM

హైదరాబాద్: అమీర్‌పేట మైత్రివనం ఎదురుగా గురువారం అగ్నిప్రమాదం(Ameerpet Fire Accident) జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ ను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kalvakuntla Kavitha) పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అమీర్ పేట్(Ameerpet)లో జరిగిన అగ్నిప్రమాదం సడెన్ గా జరిగింది కాదన్న కవిత అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని మూడు నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నారని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్నిప్రమాదం కారణంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని వివరించారు. ప్రమాదం జరిగిన గంట పావు వరకు అగ్నిమాపక సిబ్బంది రాకపోవటం దారుణమన్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సరైన సమయానికి ఫైరింజన్లు వచ్చి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేదని తెలిపారు. ప్రమాదం జరిగిన షాప్ వాళ్లందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కవిత కోరారు.