ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం
టీఆర్ ఎస్ అధినేత్రి కలవకుంట్ల కవిత
మందమర్రి,(బెల్లంపల్లి): (విజయక్రాంతి): సింగరేణి ప్రైవేటీకరణ, అండర్ గనుల కోసం కోట్లాడుదామని టీఆర్ ఎస్(Telangana Rakshana Sena) అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. కాసిపేట గనిలో జరిగిన టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట(TRS Singareni Baayi Baata) కార్యక్రమంలో మాట్లాడారు. సింగరేణి ప్రవేటీకరణ కుట్రలను అడ్డుకునేందుకు పోవడమన్నారు. కొత్త బావుల తోటే ఉద్యోగాలు వస్తాయన్నారు. పాలసీలు చేసే ప్రభుత్వ పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కార్మికుల మభ్యపెట్టి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు కోసం హైదరాబాదులో సింగరేణి భవన్ ముట్టడిస్తామన్నారు.
"సింగరేణిలో లక్ష ఉద్యోగాలు వస్తాయని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి."
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ అండగా ఉంటుందనీ పేర్కొన్నారు. కార్మికుల కోసం ఉద్యమాలు చేసేందుకే జాతీయ సంఘమైన హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేస్తున్నామనీ కవిత వెల్లడించారు. తెలంగాణ లో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామనీ. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం బాయిబాటతో వచ్చానన్నారు.తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల త్యాగనిరతి పాలకులకు తెలుసన్నారు.
ఇలాంటి తాజా వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్‌ను సందర్శించండి
మరోసారి సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, సింగరేణి ఉద్యోగాలకోసం తెలంగాణ ఉద్యమ స్పూర్తితో కోట్లాడుదామని పునరుద్ఘాటించారు. తాను ఎక్కడున్నా కార్మికుల మధ్య ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందనీ వాపోయారు. ఐటీ సమస్య లేకుండా, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ఈ ప్రభుత్వం చేయటం లేదనీ విమర్శించారు. సింగరేణికి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. సింగరేణిలో అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలని, అండర్ గ్రౌండ్ మైనింగ్ ను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారనీ విమర్శించారు.
హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలిసిందేన్నారు. సింగరేణి కార్మికులకు ఢిల్లీ స్థాయిలో పనులు కావాలంటే జేబీసీసీఐ లో మనం పోరాడాలనీ రియాజ్ అందులో సభ్యులుగా ఉండి సింగరేణి కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారనీ తెలిపారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ది ఉంటే సింగరేణికి బకాయి ఉన్న రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు.కార్మికుల పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూల్స్, సరైన హాస్పిటల్స్ లేవన్నారు.
అందుకే తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా మేము అందజేస్తామని పేర్కొన్నారు. మా పార్టీకి సింగరేణి కార్మికుల దీవెనార్తి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ, కార్మికుల ఉద్యోగ భద్రతపై కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. సంబంధిత తెలంగాణ వార్తలను కూడా చదవండి.
FAQ's
1. సింగరేణి ప్రైవేటీకరణపై కవిత ఏమన్నారు?
సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని, సంస్థను బలోపేతం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
2. కొత్త గనుల వల్ల ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని కవిత చెప్పారు?
కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తే దాదాపు లక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
3. సింగరేణికి ఎంత బకాయి ఉందని కవిత ఆరోపించారు?
సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
4. సింగరేణి బాయిబాట కార్యక్రమం ఎక్కడ జరిగింది?
మంచిర్యాల జిల్లా కాసిపేట గనిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
5. తెలంగాణ రక్షణ సేన ప్రధాన డిమాండ్ ఏమిటి?
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఉద్యోగాలను కాపాడడం, కార్మిక సంక్షేమాన్ని మెరుగుపరచడం ప్రధాన డిమాండ్లు.






