7 August, 2026 | 7:58 PM

కుంభం కీర్తిరెడ్డి బర్త్‌డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

07-08-2026 06:43 PM

ఆలేరు,(విజయక్రాంతి): యువ నాయకురాలు కుంభం కీర్తిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక దివ్య ఫంక్షన్ హాలులో నీలాద్రి హాస్పిటల్ (హయత్‌నగర్), అభినవ్ కంటి దవాఖాన (మేడిపల్లి) సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కుంభం కీర్తిరెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్‌ను అభినందించారు.

ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్న ఆసుపత్రుల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, చల్ల కిషోర్, భూషపాక మనీష్, ప్రమోద్, శివ, కోళ్ల ప్రవీణ్, శివతేజ, రాకేష్, సంతోష్, తోట కార్తీక్, రాజు, దినేష్, వంశీ, వడ్లకొండ శివ, మహేందర్, సాదిక్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.