15 June, 2026 | 11:58 AM

మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకం

15-06-2026 11:04 AM

ప్రజలతో మమేకమై బాధ్యతగా విధులు నిర్వహించాలి

పోక్సోచట్టంపై మహిళా పోలీసులకు అవగాహన

 హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు 

హుజూర్ నగర్: మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల విచారణ అత్యంత కీలకమని,ప్రజలతో మమేకమై బాధ్యతగా విధులు నిర్వహించాలని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.ఆదివారం సీఐ కార్యాలయంలో హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. పోక్సో చట్టంలోని నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన కలిగి,క్షేత్రస్థాయిలో బాలికలకు చట్టాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. పాఠశాలలు,కళాశాలల్లో విద్యార్థినులకు పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా భద్రతా అంశాలు,ఆపదలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో మమేకమై ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్,మహిళా పోలీసులు,పాల్గొన్నారు.