భార్యను చంపిన కజక్ మంత్రి
విచారణలో సంచనల విషయాలు
న్యూఢిల్లీ, మే 3: కజకిస్థాన్ ఆర్థికమం త్రి తన భార్యను కొట్టిచంపిన కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. కజకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పనిచేసి కౌండిక్ బిషింబయెవ్ గత ఏడాది నవంబర్‌లో తన బంధువుకు చెందిన రెస్టారెంట్‌లో తన భార్య సల్తనత్ నుకనెవా (31)తో రోజంగా ఉన్నా డు. ఆ సమయంలో ఆయన నుకనెవాను జుట్టు పట్టుకొని తీవ్రంగా కొట్ట డంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత మరణించింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు రెస్టారెంటుకు చెందిన 8 గంటల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బిషింబయెవ్ తన భార్యను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లటం కాళ్లతో తన్నటం, పిడిగుద్దులు కురిపించటం స్పష్టంగా రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు రావటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తున్నాయి.






