14 July, 2026 | 10:30 PM

కెనడాలో భారతీయ జంట మృతి

04-05-2024 12:05 AM

ఒంటారియో, మే 3: కొంతకాలం హాయిగా ఎంజాయ్ చేద్ధామని విహారయాత్రకు వెళ్లిన ఓ భారతీయ జంట ఊహించని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వారితోపాటు వారి మనుమరాలైన మూడు నెలల శిశువు కూడా మరణించింది. భారత్‌నుంచి వెళ్లిన భార్యాభర్తలతోపాటు వారి కుటుంబసభ్యులు టొరంటోకు 50 కి.మీ. దూరం లో హైవే 401పై వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగింది. ఓ మద్యం దుకాణంలో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమ యంలో అతడు తన వ్యాన్‌ను రాంగ్‌రూట్‌లో వేగంగా హైవేపై పోనిచ్చాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారతీయుల కారును బలంగా ఢీకొట్టాడు. వేగం అధికంగా ఉండటంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.