14 July, 2026 | 9:36 PM

అర్ధరాత్రి పబ్‌లపై రైడింగ్

07-05-2024 01:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (విజయక్రాంతి) : నగరంలోని పబ్‌లపై సిటీ పోలీసులు నిఘా పెంచారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లిహిల్స్ సీఐ రాఘవేంద్ర, డిటెక్టీవ్ సీఐ బషీర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఎంఏ సయీద్, గోవర్ధన్‌రెడ్డి ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న ఓ పబ్‌పై దాడులు నిర్వహించి పబ్‌ను సీజ్ చేసిన సంగతి విధితమే. అయితే నగరంలోని పబ్‌లపై ఇక నుంచి నిత్యం దాడులు కొనసాగుతాయని, నిబంధనలకు విరుద్ధంగా అశ్లీల, అసాంఘీక కార్యక్రమాలు నిర్వహించే పబ్‌లపై కొరడా ఝులిపిస్తామని సీఐ రాఘవేంద్ర తెలిపారు.