16 April, 2026 | 4:07 AM

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు

11-06-2025 12:02 PM

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) బుధవారం హైదరాబాద్‌లోని పీసీ ఘోష్ కమిషన్ ముందు(Kaleshwaram Commission hearing) హాజరయ్యారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్, ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్, బ్యారేజీల నిర్మాణం, కాంట్రాక్టులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వ నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తోంది. 

కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసీఆర్, మరో తొమ్మిది మంది నాయకులకు మాత్రమే లోపలికి అనుమతించారు. ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ ప్రారంభం అయింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కేసీఆర్ కోరారు. జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని కేసీఆర్ తెలిపారు. అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వెంట వచ్చిన నేతలు ఎవరూ లేకుండా విచారణ కొనసాగనుంది. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మూలాన్ని మార్చడం, డిజైన్ లోపాలు, నాణ్యతా సమస్యలు, మేడిగడ్డ వద్ద స్తంభాలు మునిగిపోవడం, నిర్వహణ లేకపోవడం, అధికారిక కేబినెట్ ఆమోదం లేకుండానే నిర్మాణం ప్రారంభమైందనే ఆరోపణలు వంటి అనేక అంశాలపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.