28 May, 2026 | 1:15 PM

త్యాగం, కరుణ, సహనాన్ని చాటి చెప్పే పండుగ బక్రీద్

28-05-2026 12:12 PM

హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా)(Bakrid festival) పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సహోదరులకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు(KCR Bakrid Greetings) తెలిపారు. త్యాగానికి, దానగుణానికి ప్రతీకగా, విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగని కేసీఆర్ పేర్కొన్నారు.

ధనవంతులు, పేదలు అనే తరతమ బేధాలు లేకుండా, ప్రజల నడుమ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని బక్రీద్ పండుగ పెంపొందిస్తుందన్నారని కొనియాడారు. ఈ పవిత్ర దినాన ధార్మికత, దైవచింతన ప్రతి మానవుడి హృదయంలో విరజిమ్మాలని మాజీ సీఎం ఆకాంక్షించారు. గంగా జమున సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజల నడుమ సోదర భావం, ఐక్యత మరింత పెంపొందాలని కేసీఆర్ కోరుకున్నారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని KCR దైవాన్ని ప్రార్థించారు.