22 July, 2026 | 10:28 AM

జాతీయ రహదారిపై జుక్కల్ ఎమ్మెల్యే రాస్తారోకో

22-07-2026 09:58 AM

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.... 

నిజాంసాగర్ జూలై 22( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం 161 జాతీయ రహదారిపై జుక్కల్ శాసనసభ్యులు తొట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Lakshmikantha Rao) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు మంగళూరు గేటు వద్ద  భారీ రాస్తారోకో నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులతో జరిగిన లారీ ఛార్జింగ్ నిరసనగా భారీ ఎత్తున రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.