కేసీఆర్‌కు అవార్డులు వస్తాయి
రాకింగ్ రాకేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అనన్య కృష్ణన్ కథానాయికగా నటించింది. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను మేకర్స్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రాకేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఆలోచనను ఓ మిత్రుడికి చెప్పినప్పుడు అతని సమాధానం, నాకు కలిగిన బాధ, అవమానం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే కసి రేకెత్తించింది. ఆ కసితోనే ఈ సినిమా చేశా.
దీనికి కచ్చితంగా అవార్డ్స్ వస్తాయి. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో ప్రసారమవుతోంది. ఇదే టీమ్ మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. ఈ నెలలోనే మరో సినిమా ప్రకటించబోతున్నా’ అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గరుడవేగ అంజి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, ఆహా అక్విజిషన్స్ హెడ్ శ్రీనివాస్ కుమార్, యాక్టర్ లోహిత్ కుమార్, రమేశ్, మైమ్ మధు, రచ్చ రవి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.






