నన్ను కాదు..బచ్చలమల్లినే చూస్తారు
హీరో అల్లరి నరేశ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు అల్లరి నరేశ్ మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన చిత్ర విశేషాలివీ..
కథలో మీకు నచ్చిన అంశాలు?
-డైరెక్టర్ సుబ్బు ఈ కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్‌లోనే ఓకే అయింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. హాస్యరసం తప్ప అన్నీ ఉన్నాయి. ‘నాంది’ తర్వాత మంచి కంటెంట్ సినిమాల కోసం చూస్తున్న టైమ్‌లో ఈ కథ వచ్చింది.
మీపై క్యారెక్టర్ ప్రభావం?
‘-గమ్యం’ గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చల మల్లి కూడా ఓ పదేళ్లపాటు గుర్తుండిపోతాడు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేశా. ఇది ఆటో బయోగ్రఫీ కాదు. డైరెక్టర్ సుబ్బు ఊరిలో బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆయన ఊరి గొడవలన్నీ తనవిగా భావించే మనిషి. ఆయన జీవితంలోని మూడు సంఘటనలను తీసుకొని ఒక డిఫరెంట్ సబ్జెక్టును ఈ సినిమాలో చెప్పారు డైరెక్టర్.
చాలెంజింగ్ పార్ట్?
నడకలోనూ మూర్ఖత్వం చూపించాలని డైరెక్టర్ అడిగారు.. కొత్తగా ఏడవమనేవారు (నవ్వుతూ). నా గత సిని మాల బాడీ లాంగ్వేజ్ ఎక్కడా కనిపించకూడదనుకున్నారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అల్లరి నరేశ్‌ను మర్చిపోయి ‘బచ్చలమల్లి’నే చూస్తారు.
లుక్ కోసం జాగ్రత్తలేమైనా?!
బచ్చల మల్లి ట్రాక్టర్ నడుపుతుంటాడు. తన బాడీ గురించి ఎక్కువ కేర్ తీసుకునే పర్సన్ కాదు. అలాంటి లుక్‌ను తీసుకువచ్చేందుకు హెయిర్‌కు కాస్త రెడ్డిష్ కలర్ ట్రై చేశాం.
లవ్‌స్టోరీ ప్రాధాన్యత ఏంటి?
-బచ్చల మల్లి జీవితంలోకి కావేరి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మా యి కోసం మారుతాడు. ఫైనల్‌గా తన ఏ వైపు టర్న్ తీసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. అమృత క్యారెక్టర్‌కు పేరొస్తుంది. సినిమాలో ప్రీ క్లుమైక్స్ అద్భుతంగా ఉంటుంది. అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం.
మీ నుంచి కామెడీ సినిమాలు తగ్గుతున్నాయి కదా?
-కామెడీ నా స్ట్రెంత్. ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్‌కు కారణం కామెడీనే. అది నా హోమ్ గ్రౌండ్.. వదల ను. మధ్యమధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి సీరియస్ కంటెంట్ ఫిలిమ్స్ చేస్తా. డిఫరెంట్ సినిమాల ను చేస్తా. ‘సుడిగాడు 2’ -రైటింగ్ జరుగుతోంది. ఈసారి పాన్ ఇండి యా వెళ్తున్నాం.. కాస్త టైమ్ పడుతుంది.






