సుప్రీంకు కేజ్రీవాల్
24-06-2024 12:47 AM
- బెయిల్ నిలిపివేతపై పిటిషన్
న్యూఢిల్లీ, జూన్ 23: ట్రయల్ కోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టు నిబంధనల ప్రకారం వ్యహరించలేదని వాదించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ నెల 25వ తేదీవరకు బెయిల్‌ను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.






