పదోన్నతి పొందిన కేశంపేట ఏఎస్‌ఐలు
తలకొండపల్లి,మే 28, (విజయక్రాంతి): కేశంపేట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు శెట్టి, శ్రీనివాస్లకు ప్రభుత్వం ఎస్‌ఐలుగా ప్రమోషన్ కల్పించింది. ఇటీవల నిర్వహించిన పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం వీరిని హైదరాబాద్లో ఎస్‌ఐలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా షాద్నగర్ డీసీపీ శిరీష రాఘవేందర్ గురువారం నరసింహులు శెట్టి, శ్రీనివాస్లను ప్రత్యేకంగా అభినందించారు.
విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు అందించిన సేవలు, పోలీస్ శాఖ పట్ల అంకితభావంతో పనిచేసినందుకు ఈ ప్రమోషన్ దక్కడం ఆనందకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రమోషన్ పొందిన అధికారులు మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా నిబద్ధతతో పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నరసింహులు శెట్టి శ్రీనివాస్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.






