calender_icon.png 19 February, 2026 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు

19-02-2026 02:44:35 AM

కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెడికవర్ వైద్యుల కీలక సూచనలు

అనంతపూర్, ఫిబ్రవరి18 (విజయక్రాంతి): బైపాస్ సర్జరీ సీఏబీజీ(CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అ వకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు.

తాజాగా అ నంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు.2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిట ల్స్లో చేరారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకుంటి - చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వానస్డ్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ ఆధ్వర్యం లో నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షల్లో గతంలో అమర్చిన గ్రాఫ్ట్లలో తీవ్రమైన బ్లాకేజీలు ఉన్నట్లు గుర్తించారు.

అత్యాధునిక ఐవీయూఎస్ సాంకేతికత సహాయంతో రెండు స్టెంట్లను విజయవంతంగా అమర్చా రు. ప్రస్తుతం రోగి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.  డాక్టర్ ప్రమోద్ కుమార్  మాట్లాడుతూ బైపాస్ సర్జరీ అనేది గుండె సమ స్యలకు ముగింపు కాదు, ఒక దశలో చికిత్స మాత్రమే. శస్త్రచికిత్స అనంతరం కూడా రోగి జీవనశైలిలో మార్పులు చేయకపోతే, బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే మళ్లీ బ్లాకేజీలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు.క్రమం తప్పకుండా ఫాలో-అప్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని తెలిపారు.