20 August, 2026 | 12:04 PM

దక్షిణాది రాష్ట్రాల అంతర్గత సమస్యలపై కీలక సమావేశం

20-08-2026 11:28 AM

తెలంగాణ తరఫున హాజరుకానున్న ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు ఇతర

సత్తుపల్లి, ఆగస్టు 20(విజయక్రాంతి): దక్షిణాది రాష్ట్రాల అంతర్గత సమస్యలపై నేడు తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అంతర్గత సమస్యలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ముఖ్య అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు  సమాచారం.