రాజీవ్ గాంధీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
కామారెడ్డి, ఆగస్ట్ 20 (విజయక్రాంతి): రాజీవ్ గాంధీ సేవలు దేశానికి, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయాలు దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం గా నిలిచిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో,డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గడ్డమీది మహేష్,కామారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్,టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు సుదర్శన్,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయకుమార్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ కృష్ణ, జమీల్, రంగరమేష్ గౌడ్,సాయి బాబు, సేవాదళ్ జిల్లా యూత్ అధ్యక్షుడు, నర్సల్లా మహేష్,ఆబిద్, నిరంజన్,ఇమరోజ్,శశి,రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






