12 May, 2026 | 6:07 PM

తెలుగురాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక సమావేశం.. ఐదు అంశాలపై చర్చ

12-05-2026 05:03 PM

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల( Telugu States) ఎగ్జిబిటర్ల అసోసియేషన్(Exhibitors Association) కీలక సమావేశం నిర్వహించింది. పర్సంటేజీల విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశంలో ఐదు అంశాలపై చర్చించారు. పర్సంటేజీ విధానం, చిన్న సినిమాలకు అవకాశం, సినిమా రన్ టైమ్, లాభనష్టాల అంశం, మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్ కు ప్రాధాన్యతపై ఎగ్జిబిటర్ల భేటీలో చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.